డిసెంబర్ 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు దేహదారుఢ్య పరీక్షలు! 8 d ago
కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా దేహదారుఢ్య పరీక్షలను ఈ నెల 30 నుండి 2025 ఫిబ్రవరి 1 వరకు నిర్వహించడానికి పోలీసు నియామక మండలి ఛైర్మన్ ఎం. రవిప్రకాశ్ ప్రకటించారు. ఉమ్మడి జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈ నెల 18 నుంచి 29 వరకు కాల్‌లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. సందేహాలుంటే 94414 50639 లేదా 91002 03323 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.